హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శిథిలావస్థలో గుడిపాడు రహదారి

PLD: కొలిమిగుండ్ల గొర్విమానుపల్లె నుంచి గుడిపాడు, బూర్గలకు వెళ్లే ప్రధాన రహదారి శిథిలావస్థకు చేరుకొంది. ఏళ్ల కిందట నిర్మించిన బీటీ రోడ్డు పూర్తిగా అధ్వాన స్థితికి చేరుకోవడంతో తారు కనపడటం లేదు. కొలిమిగుండ్ల, అనంతపురం జిల్లా యాడికి,ప్యాపిలి మండలాలను అనుసంధానించే ఈ రోడ్డులో రాకపోకలు కష్టతరంగా మారాయని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.