SRPT: నంబర్ ప్లేట్లు లేకుండా వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట ట్రాఫిక్ ఎస్‌ఐ యాదవేందర్‌రెడ్డి హెచ్చరించారు. జిల్లా కేంద్రంలో శనివారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 50 ద్విచక్ర వాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నేరాలు, ప్రమాదాల గుర్తింపు కోసమే నంబర్ ప్లేట్లు విధిగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.
తెలంగాణ
సూర్యాపేటలో నంబర్ ప్లేట్ లేని బైకులు స్వాధీనం


