హైదరాబాద్: 28°C
తెలంగాణ

మైతాపూర్‌–రాయికల్ బ్రిడ్జిపై గుంతల పూడ్చివేత

JGL: రాయికల్ మండలం మైతాపూర్ గ్రామంలో మైతాపూర్–రాయికల్ వెళ్లే బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలతో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందులను తొలగించేందుకు గ్రామపంచాయతీ చర్యలు చేపట్టింది. ఈ మేరకు శనివారం సర్పంచ్ తలారి నాగమణి, పాలకమండలి సభ్యుల ఆధ్వర్యంలో సుమారు 6 ట్రిప్పుల మొరంతో ఈ గుంతలను పూడ్చివేశారు. దీంతో ప్రయాణికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.