SDPT: యూరియా, కాంప్లెక్స్ ఎరువులను అధిక ధరలకు విక్రయిస్తూ రైతులను దోచుకుంటున్నారని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కొంగరి వెంకట మావో ఆరోపించారు. శనివారం చేర్యాల వ్యవసాయ శాఖ ఏడీఏ కార్యాలయంలో వినతిపత్రం సమర్పించారు. రూ. 267 విలువైన యూరియాను రూ. 350 -రూ. 500 వరకు విక్రయిస్తున్నారన్నారు. లింక్డ్ సరుకులు అంటగడుతూ బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు.
తెలంగాణ
ఎరువులను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలి: రైతు సంఘం


