హైదరాబాద్: 28°C
తెలంగాణ

జీఓ 97 రద్దు చేయాలని పీడీఎస్‌యూ రాస్తారోకో

KMM: మధిర మండలంలో జీఓ 97ను రద్దు చేయాలని, పాలిటెక్నిక్ విద్యను ప్రైవేటీకరించకుండా టెక్నికల్ ఎడ్యుకేషన్‌లోనే కొనసాగించాలని పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో శనివారం రాస్తారోకో నిర్వహించారు. పేద విద్యార్థులకు ఇంజనీరింగ్ విద్య దూరమవుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విద్యార్థులపై కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.