హైదరాబాద్: 28°C
తెలంగాణ

జాతీయ స్థాయి స్పెల్-బీకి సత్యశోధక్ విద్యార్థినులు

NZB: హైదరాబాద్‌లో ఆదివారం జరిగే జాతీయ స్థాయి స్పెల్-బీ పోటీలకు సత్యశోధక్ పాఠశాల విద్యార్థినులు ఎం. మేఘన, సి.హెచ్. స్వేచ్ఛ ఎంపికయ్యారు. ఇటీవల నిజామాబాద్‌లో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో టాపర్లుగా నిలిచి ఛాంపియన్‌షిప్ అవార్డులు సాధించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఆర్ నర్సయ్య విద్యార్థినులను అభినందించి, జాతీయ స్థాయిలోనూ రాణించాలని ఆకాంక్షించారు.