హైదరాబాద్: 28°C
తెలంగాణ

మానవత్వం చాటుకున్న యూత్ సభ్యులు

NZB: మోపాల్ మండలం కులస్పూర్ తాండకు చెందిన జరిపుల ఆమ్రియా మృతితో ఆయన భార్య లక్ష్మి ఒంటరిగా మిగిలారు. కుమారుడు, కోడలు దూరంగా వెళ్లిపోవడంతో ఆమె దీనావస్థను చూసిన తాండ యువకులు చలించిపోయారు. నిత్యావసర సరుకులు అందించి అండగా నిలిచారు. భవిష్యత్తులోనూ ఆమెకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా తోడుగా ఉంటామని హామీ ఇచ్చారు.