హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీలో భక్తి కీర్తనల సందడి

TPT: శ్రీసిటీ ఆధ్యాత్మిక, సాహిత్య వేదిక ‘శ్రీవాణి’ ఆధ్వర్యంలో భక్తి కీర్తనల కార్యక్రమం నిర్వహించారు. సూళ్లూరుపేట కేఎస్ కళానిలయానికి చెందిన కుమారి కంచెర్ల చంద్రలేఖ బృందం, పలువురు వాగ్గేయకారులు ఆలపించిన కీర్తనలు భక్తులను అలరించాయి. అనంతరం కళాకారులను శ్రీవాణి నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో భక్తులు, సాంస్కృతిక ప్రియులు పాల్గొన్నారు.