హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేవంత్‌పై కీర్తిరెడ్డి తీవ్ర విమర్శలు

HYD: 22ఏ పేరుతో ప్రభుత్వం భూకుంభకోణానికి తెరలేపిందని బీజేపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ జూటూరు కీర్తి రెడ్డి ఆరోపించారు. జూబ్లీహిల్స్‌లో మీడియా ప్రకటన విడుదల చేసిన ఆమె.. పేదలు, సామాన్యుల భూములను 22ఏ నిషేధిత జాబితాలో చేర్చడంపై మండిపడ్డారు. తప్పులకు అధికారులను బాధ్యులను చేసి ప్రభుత్వం తప్పించుకుంటోందని విమర్శించారు.