NZB: సిరికొండలోని సీజనల్ వ్యాధులు, మలేరియా, డెంగ్యూ నివారణకు సిరికొండ గ్రామంలో ముందస్తు చర్యలు చేపట్టినట్లు సర్పంచ్ మల్లేల సాయిచరణ్ తెలిపారు. గ్రామంలోని నీటి గుంతలు, ఓపెన్ ప్లాట్లలో ఆయిల్ బాల్స్ వేసి, మలాథియన్ మందుతో పొగ పిచికారీ చేయించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గ్యామా శోభన్, పంచాయతీ కార్యదర్శి వినీల్, ఏఎన్‌ఎం స్వరూప, ఆశా వర్కర్లు, కారోబార్ ప్రవీణ్ పాల్గొన్నారు.
తెలంగాణ
సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు


