హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: రోడ్డుపై పరుగులు తీసిన భారీ పడవ..!

JN: బచ్చన్నపేట మండల కేంద్రంలోని ప్రధాన రహదారిపై లారీపై భారీ పడవను తరలించడం స్థానికులను, వాహనదారులను ఆకర్షించింది. ప్రత్యేకంగా ట్రైలర్‌పై అమర్చిన పడవను తాళ్లతో పటిష్టంగా బిగించి తరలించారు. భారీ పడవను చూసిన పలువురు వాహనాలను ఆపి ఆసక్తిగా తిలకించగా, మరికొందరు తమ సెల్‌ఫోన్లలో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. ఈ దృశ్యం మండల కేంద్రంలో చర్చనీయాంశంగా మారింది.