హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: ఎస్‌ఐఆర్‌పై విస్తృత అవగాహన కల్పించాలి: కలెక్టర్

NGKL: జిల్లాలో 1,15,851 మంది ఓటర్లకు నోటీసులు జారీ చేసినట్లు జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ తెలిపారు. అర్హులైన ఏ ఒక్కరి ఓటు హక్కు కోల్పోకుండా చర్యలు తీసుకుంటున్నామని, నోటీసులు అందుకున్న వారు ఆందోళన చెందకుండా అవసరమైన పత్రాలు సమర్పించాలని సూచించారు. ఎస్‌ఐఆర్‌ ప్రక్రియపై ప్రజలకు సరైన, వాస్తవ సమాచారాన్ని చేరవేయడంలో మీడియా ముందుండాలన్నారు.