హైదరాబాద్: 28°C
తెలంగాణ

రీసైక్లింగ్ యూనిట్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

NGKL: అచ్చంపేట నియోజకవర్గంలోని చౌటపల్లిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్ షెడ్డు నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం ఆకస్మికంగా పర్యటించిన ఆయన పనుల పురోగతిని పరిశీలించారు. జాప్యానికి కారణాలు తెలుసుకుని, నాణ్యతతో పనులు పూర్తి చేసి త్వరలో రీసైక్లింగ్ ప్రక్రియ ప్రారంభించాలని సూచించారు.