నల్గొండ జిల్లాలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రీప్రైమరీ సెక్షన్లకు ఇన్‌స్ట్రక్టర్లు, ఆయాల నియామకాలు నిలిచిపోయాయి. 124 పాఠశాలలకు నోటిఫికేషన్ జారీ చేసి మెరిట్ జాబితా విడుదల చేయడంతో పాటు ఆగస్టు 1న నియామక ఉత్తర్వులు ఇచ్చారు. అయితే అదే రోజు విధుల్లో చేరొద్దంటూ మౌఖిక ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. రాజకీయ ఒత్తిళ్ల కారణంగానే నియామకాలు నిలిచిపోయాయన్న ఆరోపణలపై స్పష్టత రావాల్సి ఉంది.
తెలంగాణ
నల్గొండలో ప్రీప్రైమరీ నియామకాలకు బ్రేక్


