హైదరాబాద్: 28°C
తెలంగాణ

హాస్టల్‌ను తనిఖీ చేసిన ఎమ్మెల్యే

BDK: ఇల్లందు మండలం బొజ్జాయిగూడెం ఆశ్రమ పాఠశాల హాస్టల్‌ను ఎమ్మెల్యే కోరం కనకయ్య శనివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనం, పరిసర ప్రాంతాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. కొద్ది రోజుల్లో డైనింగ్ హల్, మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు.