హైదరాబాద్: 28°C
తెలంగాణ

రహదారిపై మరమ్మత్తులు చేసిన సర్పంచ్

NRML: మండలంలోని రేవోజీపేట గ్రామపంచాయతీ పరిధిలో పాండ్వాపూర్ - కలమడుగు రహదారిపై సర్పంచ్ కోల మహేష్ రోడ్డు మరమ్మతులు చేపట్టారు. వాహనదారుల ఇబ్బందులను గుర్తించిన సర్పంచ్ శనివారం మధ్యాహ్నం పంచాయతీ సిబ్బందితో కలిసి సిమెంట్, కంకర, ఇసుక మిశ్రమంతో గుంతలను పూడ్చారు. వాహనదారుల ఇక్కట్లను గుర్తించి సొంత నిధులతో రహదారికి మరమ్మత్తులు చేసిన సర్పంచును పలువురు అభినందించారు.