హైదరాబాద్: 28°C
తెలంగాణ

హత్య కేసులో కానిస్టేబుల్ డిస్మిస్

సూర్యాపేట జిల్లా మోతె పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ మహమ్మద్ షరీఫ్‌పై పోలీస్ శాఖ కఠిన చర్యలు తీసుకుంది. భార్యాభర్తల హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న షరీఫ్‌ను ఎస్పీ నరసింహా శాశ్వతంగా ఉద్యోగం నుంచి డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. సంచలనం సృష్టించిన ఈ కేసులో శాఖాపరమైన చర్యలు చేపట్టారు.