హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: నిరూపయోగంగా వాటర్ ఫౌంటెన్

వరంగల్ నగరంలోని కాశిబుగ్గ బాలాజీనగర్ జంక్షన్ వాటర్ ఫౌంటెన్ వెలవెలబోతోంది. ప్రారంభించిన కొత్తలో ఈ ఫౌంటెన్ స్థానికులను విపరీతంగా ఆకట్టుకుంది. కాగా, నిర్వహణ లోపంతో గత 6 నెలల నుంచి ఈ ఫౌంటెన్ పనిచేయడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ఇది నిరుపయోగంగా ఉందని, పాలకులు వెంటనే అందుబాటులోకి తేవాలని కోరుతున్నారు.