PDPL: ప్రభుత్వ చేయూత పథకం కింద పింఛన్ కోసం అర్హులు నేరుగా, రామగుండం కార్పొరేషన్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ అరుణశ్రీ సూచించారు. మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని హెచ్చరించారు. డివిజన్లలో హెల్ప్‌డెస్క్‌లు, వార్డు అధికారులు, సహాయకులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈనెల 31 వరకు ప్రత్యేక కౌంటర్‌లో పూర్తి వివరాలతో దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
తెలంగాణ
చేయూత పింఛన్ల కోసం దరఖాస్తుల ఆహ్వానం


