హైదరాబాద్: 28°C
తెలంగాణ

డ్రైనేజీ సమస్య పరిశీలించిన ఛైర్ పర్సన్

BHNG: భువనగిరిలో బ్రహ్మంగారి గుడి వద్ద ప్రధాన రహదారిపై డ్రైనేజీ పొంగిపొర్లుతుండటంతో మున్సిపల్ ఛైర్ పర్సన్ శ్రీవాణి రవికుమార్ శనివారం పరిశీలించారు. కాలువలోని పూడికను వెంటనే తొలగించి, శుభ్రం చేయాలని అధికారులను ఆదేశించారు. రోగాలు ప్రబలకుండా చూడాలన్నారు. డ్రైనేజీల్లో చెత్త వేయొద్దని సూచించారు. కార్యక్రమంలో కౌన్సిలర్ జాలిగం విగ్నేష్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.