VKB: పట్టణంలోని అస్సాం బేకరీ వెనుక కాలనీలో అపరిశుభ్రతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇళ్ల మధ్య పిచ్చిమొక్కలు, చెత్తాచెదారం పేరుకుపోవడంతో దుర్వాసన వెదజల్లుతోందని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రోగాల బారిన పడుతున్నామని తెలిపారు. మున్సిపల్ అధికారులు వెంటనే స్పందించి శుభ్రత చర్యలు చేపట్టాలని కోరారు.
తెలంగాణ
చెత్తాచెదారంతో కాలనీవాసుల అవస్థలు


