హైదరాబాద్: 28°C
తెలంగాణ

ట్రీ పార్కులో పిచ్చి మొక్కల తొలగింపు

GDWL: గద్వాలలోని వడ్డేవీధిలోని ట్రీ పార్కులో పిచ్చి మొక్కలు పెరిగిపోవడంతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్యను గుర్తించిన BRS మున్సిపల్‌ కౌన్సిలర్‌ కమ్మరి సునీత రాము వార్డు ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని పార్కులోని పిచ్చి మొక్కలను తొలగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలన్నారు.