హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఐటీ టవర్ పనులు గడువులోగా పూర్తి చేయాలి'

WNP: నాగవరంలో 2 ఎకరాల్లో రూ.22 కోట్లతో నిర్మిస్తున్న ఐటీ టవర్ పనులను కలెక్టర్ ఆదర్శ్ సురభి శనివారం పరిశీలించారు. భవనం ఎలివేషన్, అంతస్తుల డిజైన్‌ను పరిశీలించి పనులు నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఏప్రిల్ 2026లో అగ్రిమెంట్ చేసుకున్న ప్రతాప్రెడ్డి–కొండా ఏజెన్సీ ఏప్రిల్ 2027 నాటికి భవనం పూర్తి చేసి అప్పగించాలని సూచించారు.