MBNR: ఉద్యోగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని మాజీ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఉద్యోగుల EHS, పీఆర్సీ, డీఏ బకాయిలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. సీపీఎస్‌ను రద్దు చేసి, ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం బీఆర్‌ఎస్ నిరంతరం పోరాటం చేస్తుందన్నారు.
తెలంగాణ
సమస్యలపై బీఆర్‌ఎస్ పోరు: శ్రీనివాస్‌గౌడ్


