హైదరాబాద్: 28°C
తెలంగాణ

టీచర్ భవానీని అభినందించిన జిల్లా కలెక్టర్

కామారెడ్డి జిల్లా గాంధారి మండలం ఎంపీపీఎస్ (గర్ల్స్) ఉపాధ్యాయురాలు భవానీ బొంపెల్లికి జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు 2026 లభించింది. మన రాష్ట్రం నుంచి ఎంపికైన ఏకైక ఉపాధ్యాయురాలు ఈమె కావడం విశేషం. ఈ సందర్భంగా కామారెడ్డి కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ ఎక్స్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ఆమె సృజనాత్మక బోధనా శైలి, విద్యార్థులపై చూపుతున్న శ్రద్ధ అభినందనీయమన్నారు.