హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్యే

KMR: గోవిందా.. గోవిందా.. నామస్మరణలతో బీర్కూర్‌ మండలం తిమ్మాపూర్‌ శివారులోని తెలంగాణ తిరుమల దేవస్థానం మారుమోగింది. శ్రావణ మాసం శనివారం కావడంతో ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు ప్రత్యేక వాహనాల్లో తరలివచ్చారు. బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శ్రీవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.