హైదరాబాద్: 28°C
తెలంగాణ

అన్నపూర్ణేశ్వరుడిగా విశ్వనాథుడి అలంకరణ

వరంగల్ పట్టణంలోని స్టేషన్ రోడ్డులో గల ఆకారపు కాశీ విశ్వేశ్వరస్వామి ఆలయంలో ఇవాళ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు. శ్రావణమాసం రెండో శనివారం సందర్భంగా విశ్వనాథుడికి అన్నపూజ నిర్వహించి, అన్నపూర్ణేశ్వరుడిగా అలంకరించారు. వారాంతం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి, స్వామివారిని దర్శించుకుని, పూజలు చేస్తున్నారు.