హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఖమ్మం సరిహద్దుల్లో ముమ్మర తనిఖీలు..!

KMM: సీపీ సునీల్ దత్ ఆదేశాలతో ఎర్రుపాలెం అంతరాష్ట్ర సరిహద్దు వద్ద వైరా ఏసీపీ సారంగపాణి ఆధ్వర్యంలో పోలీసులు వాహన తనిఖీలు చేపట్టారు. వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించాలని, పత్రాలు వెంట ఉంచుకోవాలని ఏసీపీ సూచించారు. నిబంధనలు పాటిస్తూ ప్రమాదాల నివారణకు పోలీసులకు సహకరించాలని ప్రయాణికులకు అవగాహన కల్పించారు.