హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆపదలో అండగా.. ప్రభాకర్‌రెడ్డి

SDPT: దుబ్బాక మండలం ఇర్కోడు- తొర్నాల మధ్య పండ్ల రవాణా టాటా ఏస్‌ బోల్తా పడిన ఘటనలో క్షతగాత్రులను ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పరామర్శించారు. ప్రమాదాన్ని గమనించిన వెంటనే కాన్వాయ్‌ను నిలిపి బాధితుల వద్దకు చేరుకున్నారు. క్షతగాత్రులను తక్షణమే ఆసుపత్రికి తరలించి మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.