హైదరాబాద్: 28°C
క్రీడలు

ట్రోఫీలు గెలవడమే నా పని: గంభీర్‌

టెస్ట్ జట్టు ఇబ్బందుల్లో ఉందన్న విమర్శలను భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ కొట్టిపారేశాడు. ఒకరి ఇష్టాలు, అభిప్రాయాలతో తమకు పనిలేదన్నాడు. శ్రీలంకతో రెండో టెస్టుకు ముందు కొలంబోలో మాట్లాడుతూ.. కెప్టెన్ గిల్ నేతృత్వంలో కొత్త బృందం ఏర్పడిందని చెప్పాడు. ర్యాంకింగ్‌లు, బయటి విమర్శలు పట్టించుకోకుండా, ట్రోఫీలు సాధించడంపైనే పూర్తిగా దృష్టి పెట్టామని గంభీర్ స్పష్టం చేశాడు.