హైదరాబాద్: 28°C
తెలంగాణ

వృద్ధాశ్రమంలో చీరలు, పండ్లు పంపిణీ

MBNR: జడ్చర్ల 8వ వార్డులోని వృద్ధాశ్రమంలో కీ.శే. విశ్వవాణి జయంతి సందర్భంగా సేవా కార్యక్రమం నిర్వహించారు. మాజీ మంత్రి చర్లకోళ్ల లక్ష్మారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్‌పర్సన్ ధోరేపల్లి లక్ష్మీ రవీందర్ తదితరులు వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. వృద్ధుల సంక్షేమానికి ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు, మాజీ కౌన్సిలర్లు పాల్గొన్నారు.