హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఆలయ పునః నిర్మాణ నమూనా కరపత్రం ఆవిష్కరణ

NLG: చిట్యాల మండలం పెద్దకాపర్తి శ్రీ ఉమామహేశ్వర స్వామి దేవాలయ పునర్నిర్మాణ కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన ఆలయ నిర్మాణ నమూనా కరపత్రాన్ని శనివారం ఆవిష్కరించారు. సర్పంచ్ కాటం వెంకటేశం, ఉపసర్పంచ్ సైదులు, మాజీ సర్పంచ్ జలంధర్ రెడ్డి విడుదల చేశారు. కమిటీ అధ్యక్షుడు మధుసూదన్ గుప్తా, ప్ర.కార్యదర్శి నీలకంఠం నరేష్, తిరుమలయ్య మల్లేశ్వరి, సభ్యులు పాల్గొన్నారు.