హైదరాబాద్: 28°C
తెలంగాణ

దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ: ఎస్పీ

SRCL: గంభీరావుపేట పోలీస్‌స్టేషన్‌ను వార్షిక తనిఖీల్లో భాగంగా జిల్లా ఎస్పీ మహేష్ బి. గితే శనివారం తనిఖీ చేశారు. కేసుల దర్యాప్తు, రికార్డులు, పెట్రోలింగ్, సిబ్బంది పనితీరును సమీక్షించారు. గ్రామాల్లో రాత్రి పెట్రోలింగ్ ముమ్మరం చేయాలని, దొంగతనాల నివారణకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని SP సూచించారు.