హైదరాబాద్: 28°C
తెలంగాణ

'బంగారు గూడలో మౌలిక వసతులు కల్పించాలి'

ADB: ఆదిలాబాద్ మండలంలోని బంగారు గూడలో అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం నాయకులు శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లా కార్యదర్శి మంజుల మాట్లాడుతూ.. కరెంటు స్తంభాలు, వీధి లైట్లు లేక రాత్రివేళల్లో ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. రోడ్డు నిర్మాణం, డ్రైనేజీ, పలు మౌలిక వసతులు కల్పించాలని కోరారు.