NLG: నకిరేకల్ మండలం నోముల గ్రామానికి చెందిన నాగరాజు ఈరోజు అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆయన మృతదేహానికి పూలమాలను వేసి నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను పరామర్శించి మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట నోముల గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
నాగరాజు మృతి బాధాకరం: ఎమ్మెల్యే


