హైదరాబాద్: 28°C
తెలంగాణ

'పాఠశాల పనులు వేగవంతం చేయాలి'

BHPL: ఘన్‌పూర్ మండలం మైలారంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా మోడల్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణ పనులను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. శనివారం పనులను పరిశీలించిన ఆయన నాణ్యతలో రాజీ పడవద్దన్నారు. 2,640 మంది విద్యార్థులు, 300 మంది సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.