KMM: మధిర నుంచి గొల్లగూడెం వెళ్లే మార్గంలోని మాటూరు క్రాస్ రోడ్డు దాటిన తర్వాత రహదారిపై శనివారం ఓ చెట్టు అడ్డంగా విరిగిపడిందని స్థానికులు తెలిపారు. దీని కారణంగా మధిర నుంచి తిరువూరు వైపు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. ఈ విషయంపై అధికారులు వెంటనే స్పందించి, రోడ్డుపై విరిగిపడ్డ చెట్టును తొలగించి సమస్యను పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
రోడ్డుకు అడ్డంగా చెట్టు.. వాహనదారుల ఇక్కట్లు


