హైదరాబాద్: 28°C
తెలంగాణ

నరసింహ స్వామి దర్శనానికి పోటెత్తిన భక్తులు

NZB: ధర్పల్లి మండలం దుబ్బాకలోని లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో శని, సోమవారాల సందర్భంగా భక్తుల సందడి నెలకొంది. నలుమూల గ్రామాల నుంచి తరలివచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకుని నైవేద్యాలు సమర్పించి, బియ్యం మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం కొండపై ఉన్న కోనేరు, కళ్యాణ మండపం, హనుమంతుని, నాగదేవత ఆలయాలను దర్శించుకున్నారు.