KMM: గోదావరి జలాలను తాగునీటి అవసరాలకే మొదటి ప్రాధాన్యత ఇస్తూ వినియోగించాలని కలెక్టర్ దివాకర టీఎస్ ఆదేశించారు. శనివారం ఆయన ఏన్కూరు, కల్లూరు మండలాల్లోని వివిధ కాలువలు, రెగ్యులేటర్లు, చెరువులకు వస్తున్న నీటి ప్రవాహాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నీటి మట్టం వివరాలను అధికారులను అడిగి తెలుసుకుంటూ, సరఫరాపై పలు సూచనలు చేశారు.
తెలంగాణ
తాగునీటికే తొలి ప్రాధాన్యత ఇవ్వాలి: కలెక్టర్


