హైదరాబాద్: 28°C
తెలంగాణ

బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

GDWL: గట్టు మండలం పెంచికలపాడు గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ కె. ఆంజనేయులు, ఉప సర్పంచ్ ముహమ్మద్ కోరారు. ఈ మేరకు శనివారం డిపో మేనేజర్ శ్రీధర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు, మహిళలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజల అవసరాలను దృష్టిలో ఉంచుకుని సర్వీసు ప్రారంభించాలని కోరారు.