హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: వారికి ఉచితంగా 35 కిలోల బియ్యం: ఎమ్మెల్యే

NGKL: నల్లమల్ల అటవీ ప్రాంతంలోని అంత్యోదయ కుటుంబాలకు ఉచితంగా 35 కిలోల బియ్యం పంపిణీ చేయనున్నట్లు అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తెలిపారు. అమ్రాబాద్ మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేశారు. అంత్యోదయ పథకాన్ని గత ప్రభుత్వం రద్దు చేసిందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.