హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఏజెన్సీలో గాడిద పాలకు డిమాండ్..!

BDK: భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో గాడిద పాల విక్రయాలు ఆసక్తికరంగా మారాయి. కొందరు వ్యాపారులు వీధుల్లోనే గాడిదల నుంచి పాలను పితికి, వినియోగదారులకు విక్రయిస్తున్నారు. గాడిద పాలు ఆరోగ్యానికి మేలు చేస్తాయనే నమ్మకంతో కొందరు కొనుగోలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విక్రయాలపై అధికారుల పర్యవేక్షణ అవసరమని స్థానికులు అంటున్నారు.