హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జనసేనలో మేయర్ అభ్యర్థిత్వంపై విభేదాలు

కృష్ణా: మచిలీపట్నం మేయర్ అభ్యర్థిగా బండి రామకృష్ణ పేరును జనసేన టౌన్ అధ్యక్షుడు ప్రకటించడంతో పార్టీలో విభేదాలు బహిర్గతమయ్యాయి. తనకు ఇప్పటికే మేయర్ అభ్యర్థిగా హామీ ఇచ్చారని నేత కొట్టే వెంకట్రావు అభ్యంతరం వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకల పేరుతో సంతకాలు సేకరించడాన్ని తప్పుబట్టారు. దీంతో పార్టీలో రాజకీయ వేడి పెరిగింది.