హైదరాబాద్: 28°C
క్రైమ్

భారీగా గంజాయి చాక్లెట్లు సీజ్

TG: మేడ్చల్ జిల్లా జగద్గిరిగుట్టలో గంజాయి చాక్లెట్లు అమ్ముతున్న మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితురాలు జ్యోతి నుంచి 23 కిలోల గంజాయి చాక్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. విద్యార్థులే లక్ష్యంగా జ్యోతి గంజాయి చాక్లెట్లను అమ్ముతుంది. పక్కా సమాచారంతో మహదేవ్‌పురంలో ఎస్‌వోటీ పోలీసులు దాడి చేశారు. మహారాష్ట్ర నుంచి గంజాయి చాక్లెట్లు సరఫరా అవుతున్నట్లు గుర్తించారు.