హైదరాబాద్: 28°C
క్రైమ్

హోటల్ ఛైర్మన్‌పై లైంగిక వేధింపుల కేసు 

TG: ఓ స్టార్ హోటల్ ఛైర్మన్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదైంది. హైదరాబాద్‌లోని బేగంపేట పీఎస్‌లో హోటల్‌లో పనిచేస్తున్న మహిళ ఫిర్యాదు చేసింది. తరచూ అసభ్యకర వ్యాఖ్యలతో వేధించాడని మహిళ ఆరోపించింది. జీతం పెంపు కోసం లైంగిక కోరికలు తీర్చాలని బలవంత పెట్టారని ఫిర్యాదులో పేర్కొంది. మరోవైపు షీటీమ్స్, మహిళా సంక్షేమ విభాగానికి కూడా బాధితురాలు ఫిర్యాదు చేసింది.