హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గంజాయి కేసులో ఎస్సైపై వేటు!

GNTR: సంతమాగులూరు ఎస్సై నాగమల్లేశ్వరరావు వీఆర్‌కు బదిలీ అయ్యారు. శంకవరప్పాడు వద్ద రోడ్డు ప్రమాదానికి గురైన ఎస్సైల కారులో గంజాయి లభించడంతో కేసు నమోదైంది. తీవ్ర ఆరోపణల నేపథ్యంలో ఐజీ, ఎస్పీలు ఘటనా స్థలాలను సందర్శించి గోప్యంగా విచారణ పూర్తి చేశారు. విధి నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరించిన బల్లికురవ ఎస్సైకి అధికారులు ఛార్జ్ మెమో జారీ చేశారు.