హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అన్నా క్యాంటీన్‌ ఆవరణలో మురుగునీటి తిష్ట

KRNL: కోసిగిలో ఒకే ఆవరణలో ఎన్టీఆర్ అన్నా క్యాంటీన్, పాఠశాల, అంగన్వాడీ, హాస్టల్, లైబ్రరీలు ఉన్నాయి. వీధుల నుంచి వచ్చే మురుగునీరు ఆవరణలోనే నిలిచిపోవడంతో దుర్గంధం, అపరిశుభ్రత నెలకొంది. మురుగునీటిపై దోమలు, ఈగలు ముసురుతుండటంతో విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అన్నా క్యాంటీన్‌లో భోజనం చేసే సమయంలో ఈగలు, దోమల బెడద తప్పడం లేదని స్థానికులు వాపోతున్నారు.