BPT: 18ఏళ్లు నిండిన యువతీ యువకులు, ఇప్పటి వరకు ఓటు హక్కు లేని వారు నూతన ఓటరుగా నమోదు చేసుకోవాలని చీరాల ఎమ్మెల్యే ఎం.ఎం. కొండయ్య విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గంలోని 246 పోలింగ్ కేంద్రాల్లో బీఎల్ఓలు అందుబాటులో ఉంటారని తెలిపారు. ఆగస్టు 22, 23, 29, 30 తేదీల్లో గ్రామ సచివాలయాల వద్ద ఓటు నమోదు ప్రక్రియ ఉంటుందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఓటు నమోదుకు ప్రత్యేక అవకాశం: ఎమ్మెల్యే


