హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'పోలింగ్ కేంద్రంలో వసతుల కల్పనకు చర్యలు'

VZM: బొండపల్లి MPDO అరసాడ రఘుపతి రావు శనివారం మండలంలోని కొత్తపాలెం గ్రామంలో పోలింగ్‌ కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రంలో మౌలిక వసతులు, తాగునీరు, విద్యుత్తు, మరుగుదొడ్లను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ.. పోలింగ్‌ కేంద్రంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని వసతులు కల్పించేందుకు చర్యలు చేపడుతున్నామని తెలిపారు.