హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

శ్రీకాళహస్తి ఆలయం గురించి తెలుసా..?

అన్నమయ్య: శ్రీకాళహస్తి ఆలయం ప్రముఖ శైవ క్షేత్రాల్లో ఒకటి.  శ్రీకాళహస్తీశ్వర స్వామిని వాయులింగంగా పూజిస్తారు. ఆలయంలో దీపం గాలి లేకపోయినా కదులుతూ కనిపించడం వాయుతత్వానికి ప్రతీకగా భక్తులు భావిస్తారు. రాహు- కేతు పూజలకు కూడా ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. ఆలయ నిర్మాణం, శిల్పకళ, ఆధ్యాత్మిక విశ్వాసాలు శ్రీకాళహస్తికి ప్రత్యేక గుర్తింపును తెచ్చాయి.